12 వ‌సంతాలు పూర్తి చేసుకున్న‌ చ‌ర‌ణ్-ఉపాస‌న జోడీ

12 వ‌సంతాలు పూర్తి చేసుకున్న‌ చ‌ర‌ణ్-ఉపాస‌న జోడీ

Published on Jun 15, 2024 8:00 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మెగా కోడ‌లు ఉపాస‌న ల వివాహం జూన్ 14, 2012లో జ‌రిగింది. వారిరువురు వివాహ‌బంధంలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న త‌న ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు.

“మ‌న బంధానికి అప్పుడే 12 వ‌సంతాలు పూర్తయ్యాయంటే న‌మ్మ‌లేక పోతున్నా.. నా మీద ఇంత‌టి ప్రేమ‌ను కురిపిస్తున్నందుకు థ్యాంక్స్. మా జీవితాలు మ‌రింత అందంగా మార‌డానికి తోడ్ప‌డిని ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్..” అంటూ ఉపాస‌న పోస్ట్ చేశారు..

అయితే, ఈ పోస్ట్ కు రామ్ చ‌ర‌ణ్ రిప్లై చేశారు. “ఉప్సీ.. నేను నీ జీవిత భాగ‌స్వామిని అయినందుకు సంతోషిస్తున్నా..” అంటూ ఆయ‌న రాసుకొచ్చారు. కాగా, ఉపాస‌న త‌న పోస్ట్ లో రామ్ చ‌ర‌ణ్ తో పాటు త‌మ కూతురు క్లిన్ కారా ను కూడా ట్యాగ్ చేయ‌డం విశేషం. ఇక మెగా క‌పుల్ కు సెలబ్రిటీలు త‌మ విషెస్ చెబుతూ సంద‌డి చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు