ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Mar 4, 2024 2:40 PM IST

ఈ వారం శివరాత్రి స్పెషల్‌ గా చాలా చిత్రాలు రాబోతున్నాయి. గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’, విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’, మలయాళ చిత్రం ‘ప్రేమలు’, ‘రికార్డ్‌ బ్రేక్‌’ అనే మరో సినిమా , అలాగే ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’, ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’ వంటి చిన్న చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్‌ ప్లేయర్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది)

కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

షో టైమ్‌ (హిందీ): మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు