థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Apr 1, 2024 10:33 AM IST

ఈ ఏప్రిల్‌ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

1. విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2. సూర్యతేజ ఏలే కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’ ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
3 . హర్షివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ఏప్రిల్‌ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
4 . మలయాళ సినిమా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా ఏప్రిల్‌ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

టు గెదర్‌ (వెబ్‌సిరిస్‌) ఏప్రిల్‌ 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫైల్స్‌ ఆఫ్‌ ది అన్‌ ఎక్స్‌ప్లైన్డ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రిప్‌లే (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పారాసైట్‌: దిగ్రే (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్కూప్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

మ్యూజికా (హాలీవుడ్) ఏప్రిల్‌ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యే మేరీ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌-3) ఏప్రిల్‌ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హౌ టూ డేట్‌ బిల్లీ వాల్ష్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

ఫర్రే (హిందీ) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆపిల్ టీవీ ప్లస్‌ :

లూట్‌ (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సుగర్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

లంబసింగి (తెలుగు) ఏప్రిల్‌ 02 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు