థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Apr 22, 2024 11:11 AM IST

ఈ ఏప్రిల్‌ నాలుగో వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

 

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

‘ప్రతినిధి 2’ :

నారా రోహిత్‌ ‘ప్రతినిధి 2’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘రత్నం’ :

విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా… హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ ఫ్లిక్స్‌ :

డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టిల్లు స్క్వేర్‌ (తెలుగు) – ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

దిల్‌ దోస్తీ డైలమా (హిందీ)- ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్‌ మై షో :

కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌) – ఏప్రిల్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ :

భీమా (తెలుగు) – ఏప్రిల్‌ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాక్‌ (హిందీ)- ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

లయన్స్‌ గేట్‌ ప్లే :

ది బీ కీపర్‌ (హాలీవుడ్‌) – ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో :

ది జెనెక్స్‌(వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపిల్‌ టీవీ :

ది బిగ్‌ డోర్‌ ప్రైజ్‌2 (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు