నాగార్జున, నాని మల్టి స్టారర్ విశేషాలు !

తెలుగులో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ రానుంది. అదేదొకాదు నాగార్జున, నాని మల్టి స్టారర్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ పతాకంపై ఉండొచ్చని టాక్. అశ్వనీ దత్ నిర్మించబోతున్నాడు. ఫిబ్రవరి 24న ఈ సినిమా ప్రారంభం కానుంది. కామిడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతుంది.

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా గా ఈ మూవీ ని తియ్యబోతున్నాడు దర్శకుడు. ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా కనిపించగా నాని డాక్టర్ రోల్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ కోసం ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి. నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version