అవైటెడ్ “పుష్ప” మాస్ ట్రీట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Apr 2, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి రాబోయే బన్నీ బర్త్ డే అదిరే ట్రీట్ కావాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వారి కోరిక మేరకు మంచి ట్రీట్ ఆల్రెడీ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదేంటా అన్నది తెలుస్తుంది. ఇంకా వచ్చే వీడియో టీజర్ నా లేక గ్లింప్స్ వీడియోనా అన్నది తెలియలేదు కానీ ఒకటే మాస్ వీడియోను ప్లాన్ చేస్తున్నారట. అంటే పాన్ ఇండియన్ సినిమా అయినా అన్ని భాషలకు కలిపి ఒకటే వీడియో అని తెలుస్తుంది. మరి మేకర్స్ ఎలాంటి వీడియోను రిలీజ్ చేస్తారో చూడాలి. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :