ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవితేజ హీరోగా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నేల టికెట్టు’. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. . డాన్స్ మాస్టర్ రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో ఈ చిత్రీకరణ జరుగుతోంది.
శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. రవితేజ సరసన మాళవికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖేష్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమా మే 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు కామెడి ఈ సినిమాలో బాగుంటుందని సమాచారం.


