
భారీ బడ్జెట్ తో పీరియాడిక్ ఫిక్షనల్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ శ్రీయా శరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ పాత్రకు జంటగా శ్రీయా శరణ్ ని తీసుకున్నారు. కాగా శ్రీయా పాత్ర కేవలం రెండు నిముషాలే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఆమె షూట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉందట. ఇక గతంలో శ్రీయా శరణ్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ – ఒలివియా లవ్ ట్రాక్ కి సంబంధించి షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.