యాత్ర కు డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ !

yatra

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ రేపు తెలుగు తోపాటు మలయాళ , తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 10కోట్ల బిజినెస్ చేయగా ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇక ఈ చిత్రానికి రన్ టైం కూడా చాలా తక్కువగా వుంది. కేవలం 125 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

జగపతి బాబు , అనసూయ , సుహాసిని , ఆశ్రిత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందించగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. మరి మంచి అంచనాల మధ్య ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Exit mobile version