పవన్‌ ను చూస్తే గర్వంగా ఉంది – ఉపేంద్ర

పవన్‌ ను చూస్తే గర్వంగా ఉంది – ఉపేంద్ర

Published on Jun 16, 2024 9:00 PM IST

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో పలువురు సినీ ప్రముఖులు ఆయ‌నకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌ కల్యాణ్‌ ను చూస్తే గర్వంగా ఉందని, ఆయన సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లో మార్పొస్తుందని, ప్రజలకు అంతా మంచే జరగాలని ఉపేంద్ర ఆకాంక్షించారు. తాను గతంలో నటించిన ‘ఏ’ సినిమా రీరిలీజ్‌ కానున్న సందర్భంగా ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఉపేంద్రతో సదరు యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. ‘మీరు పార్టీని వదిలిపెట్టి పూర్తిస్థాయిలో సినిమాలకే పని చేస్తున్నారా?’ అని యాంకర్‌ అడగ్గా.. ‘‘నేను పార్టీని చూసుకుంటేనే నటిస్తున్నా. ఫండ్స్‌, లీడర్స్‌, ఫేమ్‌, వ్యక్తుల పేరు చూసి ఓటెయ్యడం.. పాలిటిక్స్‌ అంటే చాలామంది అభిప్రాయం ఇదే. నా ఉద్దేశంలో ఫండ్‌ లేకుండా పార్టీ ముందుకెళ్లాలి. ఆ విషయంలో ప్రజలే చొరవ తీసుకోవాలి. అప్పుడే అది అసలైన పీపుల్స్‌ పార్టీ అవుతుంది. నేను ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ అధ్యక్షుడిగా పని చేస్తున్నానే తప్ప ఎన్నికల్లో పోటీ చేయను. నా కుటుంబ సభ్యులూ చేయరు’’ అని ఉపేంద్ర చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు