ఉపేంద్ర కబ్జ మూవీ ప్రారంభం

ఉపేంద్ర కబ్జ మూవీ ప్రారంభం

Published on Jan 4, 2020 3:33 PM IST

kabza

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గత ఏడాది ఐ లవ్ యూ అనే ఓ రొమాంటిక్ క్రైమ్ మూవీతో అలరించారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ వున్న ఉపేంద్ర చిత్రాలు తెలుగు మరియుకన్నడలో ఒకే సారి విడుదల అవుతూ ఉంటాయి. కాగా ఆయన నేడు మరో నూతన చిత్రాన్ని ప్రారంభించారు. కబ్జ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ఉపేంద్ర పై రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టగా మహర్షి ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక సీనియర్ దర్శకులు బి గోపాల్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఉపేంద్ర నటించిన ఐ లవ్ యూ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ చంద్రు ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఆర్ చంద్ర శేఖర్, రాజ్ ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నిరవధికంగా షూటింగ్ జరిపి వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల చేయనున్నారు. సోషల్ బర్నింగ్ ఇష్యూస్ పై సెటైరికల్ గా సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అందుకే ఆయనను రియల్ స్టార్ అంటారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు