ఎన్టీఆర్.. మీరే నిజమైన గ్లోబల్ స్టార్

ఎన్టీఆర్.. మీరే నిజమైన గ్లోబల్ స్టార్

Published on Apr 15, 2024 7:12 PM IST

గ్లోబల్ స్టార్ జూ.ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న సినిమా ‘వార్ 2’. లాస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఐతే, వార్-2 సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఊర్వశి రౌతేలా ఎన్టీఆర్ తో తీసుకున్న సెల్ఫీని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ పేస్ లో ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది.

దీంతో ఈ పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అన్నట్టు ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఊర్వశి రౌతేలా క్రేజీ కామెంట్స్ చేసింది. ‘ఎన్టీఆర్ గారు.. మీరే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. మీ క్రమశిక్షణ, మీ వ్యక్తిత్వం గొప్ప ప్రశంసనీయం. త్వరలో మీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. దీంతో వార్ 2 లో ఊర్వశి రౌతేలా కూడా నటించబోతుంది అని క్లారిటీ వచ్చింది.

ఇక ఊర్వశీ రౌతేలా క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. తాజాగా ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీమ్ బెంజెమాతో ఊర్వశీ రౌతేలా ప్రేమలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఊర్వశీ రౌతేలా అతడితో సన్నిహితంగా దిగిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు