పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, హీరోయిన్ శ్రీలీల కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. మరీ భారీ హైప్ కాకుండా డీసెంట్ బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా యూఎస్ మార్కెట్ ప్రీమియర్ సేల్స్ ఇటీవల మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నార్త్ అమెరికాలో బుకింగ్స్ మొదలయ్యాక మొదట పికప్ బాగానే అయ్యింది కానీ తర్వాత నెమ్మదించింది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా లేటెస్ట్ 2 లక్షల డాలర్లు గ్రాస్ ని క్రాస్ అయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే పవన్ స్టామినాకి ఇది తక్కువే ఇంకా నెంబర్స్ పెరగాల్సి ఉంది. మరి ఈ కొన్ని రోజుల్లో పెద్ద జంప్ ఏమన్నా ఉంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
