రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి ఎన్ని ప్లాప్ లు వచ్చినా కూడా ఒక్క సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో 2012లో గబ్బర్ సింగ్ చూపించింది. ఇక నెక్స్ట్ ఇదే కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం అయ్యింది.
గత గబ్బర్ సింగ్ లా ప్రతీ పాట కూడా యూనానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేదు. వీటికి మిక్స్డ్ గానే వచ్చింది. సో ఒక్క సరైన కంటెంట్ పడాల్సి ఉంది. అది ఇప్పుడు ట్రైలర్ ఒక్కటే ఉంది. అయితే ఇది మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే. అది కూడా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ లా మంచి మాస్ ఎలిమెంట్స్ తో పడితే లేని హైప్ అంతా ఒక్కసారిగా బిల్డ్ అవుతుంది.
సో ఆ భాద్యత అంతా ఇప్పుడు హరీష్ పైనే ఉంది. అప్పట్లో గబ్బర్ సింగ్ టీజర్ లు కూడా కేవలం చిన్న డైలాగ్స్ తోనే సెన్సేషన్ సెట్ చేసాయి. ఇలాంటివి రిపీట్ అయినా తెలుగు స్టేట్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కి మంచి మైలేజ్ దక్కుతుంది. సో నేడు రానున్న ఈ సినిమా ట్రైలర్ ముందు చాలానే ఛాలెంజ్ లు ఉన్నాయని చెప్పవచ్చు.
