పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం నిరాశాజనకంగా నిలిచింది. ఓపెనింగ్ డే నుంచే ఈ సినిమాపై అంచనాలు పరిమితంగా ఉండటం, దానికి తోడు నెగిటివ్ కామెంట్స్ కారణంగా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. మొత్తమ్మీద నాలుగు రోజుల ముగిసే నాటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 80.75 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని టాక్.
నిజానికి ఇంత పెద్ద సినిమాకు ఇది చాలా తక్కువ వసూళ్లు. మరోవైపు చిత్ర నిర్మాతలు ఇంకా అధికారికంగా బాక్సాఫీస్ వసూళ్లను ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను ఉగాది స్పెషల్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఐతే, ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు.
