మార్చి 25న నాని ‘వి’ !

మార్చి 25న నాని ‘వి’ !

Published on Nov 4, 2019 10:21 AM IST

v

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కలిసి చేస్తోన్న మల్టీ స్టారర్ “వి”. కాగా తాజగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు ఇంద్రగంటి ట్వీట్ చేస్తూ.. ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు అన్నాడు విలియమ్ షేక్ స్పియరుడు. ఆల్ ఎనిమీస్… బివేర్. వచ్చే ఉగాది నుంచి ఆట, వేట మెుదలు’ అని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి సినిమా పక్కా యాక్షన్ తో సాగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, నివేత థామస్ కథానాయికలుగా నటించనున్నారు. నాని ఇంతకు ముందేన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్ర చేస్తున్నారని.. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ రోల్ అని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు