ప్రత్యేకం : వివి వినాయక్ – బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ ‘అల్లుడు శ్రీను’

ప్రత్యేకం : వివి వినాయక్ – బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ ‘అల్లుడు శ్రీను’

Published on May 15, 2014 4:15 PM IST

bellamkonda-srinivas
ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న దర్శకుడు వివి వినాయక్. వివి వినాయక్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి ఈ చిత్ర టీం ‘అల్లుడు శ్రీను’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర టీం అంతా కూడా ఈ టైటిల్ కే ఎక్కువ మొగ్గు చూపుతుండడంతో ఇదే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ప్రొడక్షన్ టీం ఉన్నారని సమాచారం.

ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన టాలీవుడ్ అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు