విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్‌పై బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా “ఐపీఎల్”. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను నేడు ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. వెంగి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్ మార్కెట్లోకి విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా దర్శకులు వి వి వినాయక్ మాట్లాడుతూ సిద్ శ్రీరామ్, సునీత ఆలపించిన ఈ పాట చాలా బాగుందని, సంగీత దర్శకుడు వెంగీ సంగీతం బాగుందని అన్నారు. చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత బీరం శ్రీనివాస్ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ మా ఐపిఎల్ సినిమా మొదటి సాంగ్ వినాయక్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.
నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు మా మూవీ లోని పాటను వి వి వినాయక్ రిలీజ్ చెయ్యడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సిద్ శ్రీరామ్, సునీత గారు ఆలపించిన లిరికల్ సాంగ్ చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. మా ఐపిఎల్ టీమ్ ను ఆశీర్వదించిన వినాయక్ గారికి ధన్యవాదాలు. సంగీత దర్శకుడు వెంగి అద్భుతమైన బాణీలను సమకూర్చారు. పాటలు అన్నీ బాగా వచ్చాయి. సిద్ శ్రీరామ్, సునీత గారు పాడిన ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది. క్రికెట్ బెట్టింగ్స్ నేపథ్యంలో యువత లైఫ్ ఎలా నాశనం చేసుకుంటున్నారన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తనికెళ్ళ భరణి, పోసాని, సుమన్ రచ్చ రవి మంచి క్యారెక్టర్స్ చేశారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.
హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ డైరెక్టర్ వినాయక్ గారికి చాలా ధన్యవాదాలు అని అన్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందని, దర్శకులు సురేష్ ఎంతో డెడికేటెడ్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. నిర్మాత శ్రీనివాస్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని అన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని అన్నారు.
సంగీత దర్శకుడు వెంగి మాట్లాడుతూ సిద్ శ్రీరామ్ సునీత గారు ఆలపించిన ఎవరివే ప్రేమ హృదయమా పాటను రిలీజ్ చేసి షూటింగ్‌ను బ్లెస్ చేసిన ప్రముఖ దర్శకులు వినాయక్ గారికి కృతజ్ఞతలు. పాటలు అన్నీ బాగా వచ్చాయి. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సురేష్ నిర్మాత బీరం శ్రీనివాస్ గార్లకు కు థాంక్స్ అని అన్నారు.