సూర్య – వెట్రిమారన్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ ఇన్ఫో!

సూర్య – వెట్రిమారన్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ ఇన్ఫో!

Published on Apr 12, 2024 8:43 PM IST

కోలీవుడ్ లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ వెట్రిమారన్. ఈ డైరెక్టర్ చివరి మూవీ విడుదల పార్ట్ 1 రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం కి సంబందించిన పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో వాడివాసల్ (vaadivaasal) అనే చిత్రం ను చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇటీవల డైరెక్టర్ వెట్రిమారన్ సినిమా పై ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ను ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న విడుదల పార్ట్ 2 పూర్తి అయిన తర్వాత స్టార్ట్ కానుంది అని వెల్లడించారు. ఇది సూర్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు