
తెలుగులో మంచి హిట్ అయిన ‘పెళ్లి’, ‘ప్రియ ఓ ప్రియ’, ‘చాలా బాగుంది’ మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో వడ్డే నవీన్. ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వడ్డే నవీన్ మళ్ళీ తిరిగి తెరపై కనిపించనున్నాడు. వడ్డే నవీన్ ని కూడా రామ్ గోపాల్ వర్మ తీసుకురానున్నాడు. రామ్ గోపాల్ వర్మ మంచు మనోజ్ తో చేయనున్న సినిమా ‘గొలుసు’. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నెగటివ్ రోల్ కోసం వడ్డే నవీన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.
త్వరలోనే వర్మ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఇందులో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాస్తో కూస్తో సినిమా ఫ్యామిలీతో టచ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వడ్డే నవీన్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరుంది. వడ్డే నవీన్ నటించిన చివరి సినిమా శ్రీమతి కళ్యాణం 2010లో రిలీజ్ అయ్యింది. ఇది కాకుండా వడ్డే నవీన్ మంచు విష్ణు నిర్మించనున్న మరో చిఎన్మాలొ కూడా నటిస్తున్నాడు.