
ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న ఫేమస్ రైటర్స్ లో వక్కంతం వంశీ కూడా ఒకరు.. ఎందుకంటే తాజాగా ఆయన రాసిన ‘ఎవడు’, ‘రేసు గుర్రం’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘అశోక్’ సినిమాతో రైటర్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ తనకి కెరీర్ కి కిక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘కిక్’.
హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చిన వక్కంతం వంశీ ప్రస్తుతం రైటర్ గా సెటిల్ అయ్యాడు. త్వరలో దర్శకుడిగా కూడా మారనున్నాడు. తన కెరీర్లో ఎక్కువగా సినిమాలు చేసింది ఎన్.టి.ఆర్ తోనే..వంశీ ఎన్.టి.ఆర్ గురించి చెబుతూ ”భక్త మార్కండేయ’ సీరియల్ నుంచి నాకు, తారక్ కి పరిచయం ఉంది. నేను మొదటి కథ రాసాక ఎవరికీ చెప్పాలా అనుకున్న టైంలో నాకు మొదట తట్టిన పేరు తారక్.. కథలకు స్పందించడంలో తారక్ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ప్రతి పాయింట్ ని ఎంజాయ్ చేస్తాడు. అతనితో మాట్లాడాక మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓ గొప్ప కథ రాశామన్న నమ్మకం కలుగుతుందని’ అన్నాడు.
అలాగే మాట్లాడుతూ ‘పూరి – ఎన్.టి.ఆర్ సినిమాకి కథని అందించా. పూరి బయటి కథకు దర్శకత్వం వహించడం ఇదే మొదటి సారి. అలాగే నేను డైరెక్టర్ గా ఎన్.టి.ఆర్ హీరోగా చేయనున్న సినిమాకి కూడా కథ ఓకే అయ్యిందని’ అన్నాడు.

