ఇప్పుడు “వకీల్ సాబ్”కు కావాల్సిన హైప్ వచ్చేసింది..!

Published on Mar 4, 2021 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”.. అవ్వడానికి రీమేక్ అయినా సరే పవన్ మార్క్ లో కావాల్సినన్ని మార్పులను దర్శకుడు చేసేసాడు. అయితే ఇది ఎంత పవన్ కం బ్యాక్ సినిమా అయినా టైం అవుతున్న కొద్దీ ఎక్కడో చిన్న అనుమానం ప్రతీ ఒక్కరికీ ఉంది. అంచనాలను రీచ్ అవుతుందా? మేకర్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసారా అన్నది.

మరి దీనికి సమాధానం గట్టిగానే ఇచ్చారని చెప్పాలి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఖచ్చితంగా మరో లెవెల్ కు ఈ సినిమాను తన ఆడియోతో తీసుకెళ్లడం ఖాయం అని చెప్పాలి. అప్పుడు వచ్చిన మగువా మగువా నుంచి ఇప్పుడు సత్యమేవ జయతే కు గట్టి గ్యాప్ ఉన్నా ఈ సాంగ్ తో సునాయాసంగా హైప్ ఒక్కసారిగా పెంచాడు. ఇప్పుడైతే ప్రతీ ఒక్కరి నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అలా మిగతా మ్యూజిక్ పార్ట్ అంతా కూడా కరెక్ట్ గా కుదిరితే సినిమా రిలీజ్ టైం కు అన్ని వర్గాలు నుంచి మంచి అటెన్షన్ గ్రాబ్ అవుతుందని చెప్పాలి.. మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :