సీడెడ్, గుంటూరు ఏరియాల్లో “వకీల్ సాబ్” వసూళ్లు ఇవే.!

Published on Apr 14, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం గత వారం విడుదలై అంతే స్థాయి భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అలాగే నిన్న ఉగాదికి అయితే మళ్ళీ పవర్ స్టార్ రేజ్ ను ఇండస్ట్రీ వర్గాలు చూశాయి.

ఇక దీనితో పాటుగా ఇప్పుడు గుంటూరు మరియు సీడెడ్ ప్రాంతాల వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు వకీల్ సాబ్ సీడెడ్ లో 10.7 కోట్లు షేర్ ను రాబట్టగా గుంటూరులో మొత్తం 7.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. దీనితో ఈ చిత్రం అక్కడ ఆల్రెడీ సేఫ్ జోన్ కు వచ్చేసినట్టు తెలుస్తుంది.

మరి మంచి నిలకడగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వసూళ్లు రాబడుతున్న వకీల్ సాబ్ ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :