తక్కువ బుకింగ్స్ తో వకీల్ సాబ్ రీ రిలీజ్!

తక్కువ బుకింగ్స్ తో వకీల్ సాబ్ రీ రిలీజ్!

Published on Apr 30, 2024 11:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం పవన్ కి సాలిడ్ కమ్ బ్యాక్ ను ఇచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి పవన్ క్రేజ్ కి గ్యాప్ తో పనిలేదు అని నిరూపించింది. అయితే ఈ చిత్రం దాదాపు మూడేళ్ళ తర్వాత రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది.

రేపు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ కానున్న ఈ చిత్రం కి చాలా తక్కువగా రెస్పాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గత చిత్రాల రీ రిలీజ్ లను పోల్చితే, చాలా తక్కువగా బుకింగ్స్ ఉన్నాయి. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ అధ్బుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు