“వకీల్ సాబ్” ఎప్పుడో..దీని మీదే బేస్ అయ్యుంది.!

“వకీల్ సాబ్” ఎప్పుడో..దీని మీదే బేస్ అయ్యుంది.!

Published on Sep 10, 2020 8:04 AM IST

Vakeel Saab1 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన లేటెస్ట్ మోషన్ పోస్టర్ టీజర్ కు మరియు ఆ పోస్టర్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే అసలు ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఒక ప్రశ్నగా మారింది. ఇంకా అతి తక్కువ షూట్ నే మిగుల్చుకున్న ఈ చిత్రం పవన్ డిసెంబర్ లో ఇచ్చిన డేట్స్ తో ముగియనుంది. ఇక ఎలాగో అప్పటికి షూట్ అయ్యిపోతుంది, మరో పక్క ఇప్పటి వరకు జరిగిన షూట్ ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ఆ మిగిలి ఉన్న భాగం కూడా పూర్తయినప్పటికీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది పూర్తిగా థియేటర్స్ తెరుచుకునే దాని మీదనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. దానిని బట్టే చిత్ర యూనిట్ ఒక టైం ను లాక్ చేసుకోనున్నట్టుగా ఇప్పుడు టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు