“వకీల్ సాబ్” మెలోడీ అప్డేట్ వస్తుంది.!

Published on Mar 15, 2021 3:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మొట్ట మొదటి వరుసలో ఉన్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. మరి ఈ తరుణంలో ఈ చిత్రం తాలూకా ప్రమోషన్స్ ను ఆడియోతో మేకర్స్ మిక్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ నుంచ రెండు పాటలు వచ్చాయి. ఆ రెండు కూడా సూపర్బ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మెలోడీ సాంగ్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇచ్చిన ఈ పాటను ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది నిర్మాణ సంస్థ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రివీల్ చెయ్యనున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే థమన్ ఆడియో పరమైన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మరి పవన్ మరియు శృతి హాసన్ ల మధ్య మళ్ళీ ఓ మంచి మెలోడీ సాంగ్ ఎప్పుడు ఎక్స్ పీరియన్స్ చేస్తామో చూడాలి.

సంబంధిత సమాచారం :