మోస్ట్ అవైటెడ్ “వకీల్ సాబ్” టీజర్ ఇలా ఉంటుందా..?

Published on Jan 14, 2021 7:08 am IST

చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సాలిడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలతో రెడీ కాబడ్డ ఈ చిత్రం నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ వస్తుండడంతో అభిమానుల్లో అంతకంతకూ ఉత్సుకత పెరిగిపోతుంది.

ఎలాగైనా ఈ కం బ్యాక్ టీజర్ తో సెన్సేషనల్ రికార్డులను మన తెలుగులో నిలపాలని పవన్ ఫాన్స్ ఎప్పటి నుంచో కంకణం కట్టుకు కూర్చున్నారు. మరి ఈ విషయంలో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న పవన్ అభిమానులకు కిక్కిచ్చే మరో బజ్ బయటకొచ్చింది. ఈ టీజర్ ను సూపర్బ్ గా మేకర్స్ కట్ చేసినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా థీమ్ లైన్ మరియు పవన్ మార్క్ ఎలివేషన్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తుంది. మరి అలాగే 40 నుంచి 50 సెకండ్ లలో ఈ టీజర్ ఉంటుందట. మరి వీటన్నింటిని మించి పవన్ పేల్చే పంచ్ డైలాగే హైలైట్ అవుతుంది అని సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. మరి దర్శకుడు శ్రీరామ్ వేణు, థమన్ మరియు దిల్ రాజుల కాంబో ఈ టీజర్ ను ఏ రేంజ్ లో రెడీ చేశారో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :

More