‘వకీల్ సాబ్’ స్పెషల్ షోల పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 5, 2021 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘వకీల్ సాబ్’ మీద ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ సినిమా ముందస్తు బుకింగ్‌ల కోసం, అలాగే స్పెషల్ షోష్ కోసం. ఇప్పటికే చాలా థియేటర్లల్లో ఆల్ రెడీ టికెట్లు అమ్ముడయ్యాయట. కోవిడ్ భయంతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయి.

ఇక ఈ సినిమాకి స్పెషల్ షోలను ప్రసారం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను మేకర్స్ రూపొందిస్తున్నప్పటికీ.. ఇప్పటికైతే ప్రభుత్వాలు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ యజమానులు ఉదయం 7 గంటల నుండి షోలను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

పవన్ రీఎంట్రీని పండుగలా సెలబ్రేట్ చేయాలనుకుని నిన్న రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా చేశారు. పవన్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందట. అందుకే ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :