‘వాల్మీకి’ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేస్తాడట !

‘వాల్మీకి’ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేస్తాడట !

Published on Aug 7, 2019 2:56 PM IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో హైలెట్ అవుతుందట. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ టీజర్‌ సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచింది. ముఖ్యంగా ప్రీ టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు