‘వాల్మీకి’ కొత్త టైటిల్.. అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం !

Valmiki

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో రేపు విడుద‌ల కాబోతున్న ‘వాల్మీకి’ చిత్రానికి ఇంకా టైటిల్ కష్టాలు తీరలేదు. వాల్మీకి టైటిల్ మార్చాలి అని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టు లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పిటీషన్ కే సంబంధించి హైకోర్టు చిత్ర యూనిట్ కు నోటీసులు పంపింది. నోటీసుల పై వివరణ ఇచ్చిన వాల్మీకి చిత్ర యూనిట్.. మొత్తానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ మారుస్తున్నామని హైకోర్టుకు తెలిపింది. కాగా కొత్త టైటిల్ “గద్దలకొండ గణేష్”గా పెడుతున్నట్లు హైకోర్టుకి నిర్మాతలు & దర్శకుడు తెలిపారు. అయితే టైటిల్ మార్పుకి సంబధించి చిత్రబృందం ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి.. తమ సినిమా టైటిల్ ఇక నుండి “గద్దలకొండ గణేష్” అని అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో హైలెట్ అవుతుందట. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version