మెగాస్టార్ కి కథ చెప్పిన స్టార్ డైరెక్టర్ !

మెగాస్టార్ కి కథ చెప్పిన స్టార్ డైరెక్టర్ !

Published on Apr 19, 2021 12:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ఉండటంతో యంగ్ డైరెక్టర్స్ కూడా చిరుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా చిరు కోసం మెసేజ్ తో పాటు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ ను రెడీ చేస్తోన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ కి వంశీ కథ చెప్పాడని తెలుస్తోంది. కానీ వంశీ కథ విన్న మెగాస్టార్ ఇంకా ఏ విషయం చెప్పలేదని తెలుస్తోంది.

ప్రసుతం చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఆచార్య సినిమాతో ‘లూసిఫర్’ రీమేక్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మెగాస్టార్. ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో మెగాస్టార్ కోసం కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కథా పరంగా చాల కీలకమైనది. ఎక్కువగా సినిమాలో హీరో తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ ఉంటాడు కాబట్టి.. ఇప్పుడు ఈ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోకి చెల్లి పాత్రలో సుహాసిని నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు