వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోన్న మరో స్టార్ డైరెక్టర్ !

Published on Jun 1, 2020 11:53 pm IST


‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి రాబోయే రోజుల్లో రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పారట. అల్లు అరవింద్ తన ఓటిటీ
ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేసాడట.

ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More