విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ టీజర్ విడుదల.. మే నెలలో సినిమా రిలీజ్

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ టీజర్ విడుదల.. మే నెలలో సినిమా రిలీజ్

Published on Apr 4, 2026 10:57 AM IST

Vanda Devullu Teaser Vijay Antony

‘బిచ్చగాడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఒక ఊరు, అక్కడ జరిగిన ఓ ఘటన, పరువు ప్రతిష్టల చుట్టూ కథ తిరుగుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ‘అసలు ఆ చుక్క ఏంటి?’ అంటూ రేపిన సస్పెన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మాస్, యాక్షన్ అంశాలతో పాటు బలమైన కుటుంబ బంధాలు, సెంటిమెంట్‌ను ఈ చిత్రంలో అద్భుతంగా జోడించినట్లు స్పష్టమవుతోంది.

ఈ సినిమాలో స్వాసిక, అజయ్, కావ్య, బాలాజీ శక్తివేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలాజీ శ్రీరామ్ సంగీతం అందిస్తుండగా, ఎస్. బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. భాష్య శ్రీ మాటలు అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు బజ్ క్రియేట్ చేయగా.. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు