వారధి షూటింగ్ ప్రారంభం

వారధి షూటింగ్ ప్రారంభం

Published on Dec 2, 2011 12:52 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఇటీవలే సినిమా ముహూర్తం జరిగింది. ఈ సినిమాకి ‘వారధి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.నిన్న హైదరాబాదులోని పోలీసు అకాడెమీలో ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ ప్రారంభినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైవీ. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. కొరటాల గతంలో భద్ర, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి పలు చిత్రాలకు డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లారెన్స్ డైరెక్షన్లో ‘రెబల్’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు