‘వరలక్ష్మీ ఇది మంచి ఆఫరే !

‘వరలక్ష్మీ ఇది మంచి ఆఫరే !

Published on Dec 25, 2019 10:00 PM IST

‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’కి హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో స్టార్ హీరోయిన్ గా మాత్రం అవ్వలేకపోయింది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వచ్చింది. అయితే వరలక్ష్మికి ఓ మంచి క్యారెక్టర్ దొరికింది. మాస్‌ మహారాజా సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. వరలక్ష్మి పాత్ర కూడా శ్రుతి హాసన్ పాత్రకు దీటుగా ఉంటుందట. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వనుందట. మొత్తానికి సైడ్ పాత్రలకే పరిమితం అయిన వరలక్ష్మికి హీరోయిన్ గా మంచి రోల్ రావడం అనేది నిజంగా ‘వరలక్ష్మీ ఇది మంచి ఆఫరే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు