హైలైట్ పాత్రలో ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ !

హైలైట్ పాత్రలో ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ !

Published on Dec 2, 2019 7:48 PM IST

‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’కి హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం బిజీ కాలేకపోతుంది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అయింది. పోనీ ఆ క్యారెక్టర్స్ అయినా, ప్రాముఖ్యత ఉన్న పాత్రలా అంటే.. ఎదో చిన్న చితక చిత్రాల్లో రెగ్యూలర్ క్యారెక్టర్స్. అయితే తాజాగా వరలక్ష్మికి ఓ మంచి క్యారెక్టర్ దొరికింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మికి మాస్‌ మహారాజా సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.

ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. వరలక్ష్మి పాత్ర కూడా శ్రుతి హాసన్ పాత్రకు దీటుగా ఉంటుందట. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వనుందట. మొత్తానికి సైడ్ పాత్రలకే పరిమితం అయిన వరలక్ష్మికి హీరోయిన్ గా మంచి రోల్ రావడం విశేషమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు