రవితేజ కంటే జయమ్మ స్పీడుగా ఉంది !

Published on Oct 29, 2020 3:04 am IST

ఈ ఏడాది ఆరంభంలో ‘డిస్కో రాజ’తో పలకరించిన రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ ముందే సగం షూటింగ్ పూర్తికాగా ఈమధ్యే తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేశారు టీమ్. ఇప్పటికే ఆలస్యం కావడంతో వేగంగా షూటింగ్ కానిస్తున్నారు. ఈరోజుతో సినిమాలో కీ రోల్ చేస్తున్న తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాలూకూ చిత్రీకరణను ముగించేశారు. దీంతో ఆమె తన డబ్బింగ్ కూడ స్టార్ట్ చేశారు. ఇందులో ఆమె జయమ్మ అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించనుండగా సముథిరఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మునుపు రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు. చాలా రోజుల కృతమే విడుదలైన ఈ చిత్ర టీజర్ బాగానే ఆకట్టుకుంది. ఇందులో మాస్ మహారాజ ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :