నా పెళ్లి ఈ ఏడాదే – వరలక్ష్మీ శరత్ కుమార్

నా పెళ్లి ఈ ఏడాదే – వరలక్ష్మీ శరత్ కుమార్

Published on Apr 15, 2024 7:35 PM IST

సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇటు హీరోయిన్ గానే కాకుండా అటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా కూడా మంచి గుర్తింపు తెచుకుంది. ఐతే, రీసెంట్ గా తన ప్రియుడు నికోలయ్ సచ్‌ దేవ్‌ తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఎంగేజ్‌మెంట్ పై, తన వర్క్ పై క్రేజీ కామెంట్స్ చేసింది.

ఇంతకీ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఏం మాట్లాడింది అంటే.. ‘ప్రస్తుతం నేను ఫుల్ బిజీగా ఉన్నాను. నా ఎంగేజ్‌మెంట్ జరిగిన మరుసటి రోజే నేను షూటింగ్‌ కు వెళ్లాల్సి వచ్చింది. సినిమాల పట్ల నాకున్న కమిట్‌మెంట్ ఇది. ఇక నా పెళ్లి విషయానికి వస్తే.. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఈ ఏడాదే నా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత కూడా నా కెరీర్‌ను కొనసాగిస్తాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. అన్నట్టు డేరింగ్‌ అండ్‌ డాషింగ్ ఫిమేల్ రోల్స్ కి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ బెస్ట్ అనేలా ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు