బన్నీ సినిమాలో వరలక్ష్మి ?

బన్నీ సినిమాలో వరలక్ష్మి ?

Published on Mar 1, 2021 2:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతుందని తెలుస్తోంది. క్రాక్, నాంది సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వరలక్ష్మి ఇప్పుడు బన్నీ సినిమాలో కూడా నటిస్తుండటంతో ఆమెకు ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది.

అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. అన్నట్టు త్వరలోనే సాంగ్స్ షూట్ కి పుష్ప టీం రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు