
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రమే “వారణాసి”.(Varanasi) గత నెల వచ్చిన గ్లింప్స్ తోనే భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ ఆడియెన్స్ నే టార్గెట్ చేస్తూ ఒకో అడుగు వేస్తూ వెళుతుంది. ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా తెరక్కుతుండడమే కాకుండా ఆ ఫార్మాట్ లో ఫస్ట్ ఎవర్ ప్లానింగ్ తో ఇపుడు ఈ సినిమా వచ్చింది.
డిజిటల్ గా 1.43 రేషియోలో ఐమ్యాక్స్ వారు సోషల్ మీడియాలో వారణాసి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దీనితో ఇదే ఫస్ట్ ఎవర్ రిలీజ్ అంటూ మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా ఎవరూ ఊహించని ప్రయత్నాలు తాము చేస్తున్నామని అంటున్నారు. ఇండియా నుంచి ప్రపంచానికి తమ ‘వారణాసి’ ని పరిచయం చేస్తున్నామని తాము చెబుతున్నారు. ఇలా మొత్తానికి మాత్రం ఇప్పుడు నుంచే పాన్ వరల్డ్ ఆడియెన్సే టార్గెట్ గా వస్తున్నారని చెప్పాలి.
FIRST TIME EVER in 1.43 in digital? ????
Trying to open new avenues in a much larger way than anyone ever imagined…
From INDIA to the WORLD, presenting #VARANASI to you all. ???? https://t.co/A6bVdOMaE9
— Varanasi (@VaranasiMovie) December 18, 2025