ఎన్ని వార్నింగ్స్ వచ్చినా కాంప్రమైస్ అయ్యే ఛాన్స్ లేదంటున్న వర్మ !

ఎన్ని వార్నింగ్స్ వచ్చినా కాంప్రమైస్ అయ్యే ఛాన్స్ లేదంటున్న వర్మ !

Published on Dec 3, 2016 1:18 PM IST

RGV
రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ చిత్రం క్షణ క్షణానికి ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈరోజు విజయవాడలో ఆడియో వేడుక నిర్వహించాలన్న నైపథ్యంలో వర్మకు కోర్టు నోటీసులు వచ్చాయి. వాటి ప్రకారమే వర్మ సినిమాలో వర్గాలను సూచిస్తూ ఉన్న ఒక పాట ‘కమ్మ, కాపు’ను సైతం తీసేశారు. ఇక ఆడియో కార్యక్రమం కోసం ఈరోజు ఉదయం వర్మ విజయవాడ చేసురుకుని అక్కడ వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధ, రత్న కుమారిలతో భేటీ అయ్యారు.

ఈ మీటింగుకు వంగవీటి అనుచరులు భారీగా తరలిరాగా, వర్మ వెంట కూడా అనుచరులు ఉన్నారు. ఈ మీటింగు గురుంచి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి సమాచారమిస్తున్న వర్మ ‘ఇప్పుడే రాధ, వాళ్ళ అమ్మగారితో మీటింగ్ జరిగింది. కానీ అది సరిగా జరగలేదు. చాలా సీరియస్, ప్రమాదకరమైన వార్నింగ్స్ వస్తున్నాయి. కానీ వేటికీ నేను కాంప్రమైజ్ కాను’ అన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం చూతుంటే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు