‘ఏబిసిడి 3’ కోసం వరుణ్ ధావన్ ఎంత తీసుకుంటూన్నాడో తెలుసా !
Published on Dec 6, 2018 5:52 pm IST

యువ హీరో వరుణ్ ధావన్ బాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారిపోయాడు. ఇటీవల ‘సుయి ధాగ మేడిన్ ఇండియా’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ ఆ చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘కలంక్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.

ఈ చిత్రం తరువాత వరుణ్ ‘ఏబిసిడి 3’ చిత్రంలో కత్రినా కైఫ్ కు జోడిగా నటించనున్నాడు. ఈసినిమా కోసం వరుణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాకి ఆయన ఏకంగా 21కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కథనం. రెమో డిసౌజా తెరకెక్కించనున్న ఈ చిత్రం 3డి లో కూడా షూట్ కానుంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook