మెగా హీరోలందు వరుణ్ వేరయా… !

Published on Sep 21, 2019 7:25 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం వాల్మీకి.ఈ చిత్రంపై మెగా అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయలేదు వరుణ్ తేజ్..ఇప్పటి వరకు క్లాస్ పాత్రల్లో ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ ఈ సినిమాలో పక్కా మాస్ రౌడి పాత్రలో నటించి తన యాక్టింగ్‌లోని మరో కోణాన్ని బయట పెట్టాడు.సినిమా చూస్తున్నంత సేపు ఈ పాత్రలో నటించింది అసలు మనవరుణ్ కాదేమో అనిపిస్తుంది.

మెగా హీరోలలో వరుణ్ పంథానే వేరు. విభిన్న చిత్రాలకు, విలక్షణ పాత్రలకు వరుణ్ మక్కువ చూపిస్తుంటారు. ఆయన హీరోగా నటించింది కేవలం ఇప్పటికి పది సినిమాలే. ఆ పది సినిమాలలో మూడు సినిమాలు ఈ కోవకు చెందినవిగా చెప్పుకోవచ్చు. ముకుంద చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన వరుణ్, రెండవ చిత్రం కంచె తో ప్రయోగాల బాటపట్టారు.

ఇక సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఆయన చేసిన అంతరిక్షమ్ మూవీ అతి పెద్ద ప్రయోగంగా చెప్పు కోవచ్చు. ఫిదా, తొలిప్రేమ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాక ఏ హీరో అయినా అంతరిక్షం లాంటి ప్రయోగం చేయరు. కానీ వరుణ్ విజయాపజయాలను పక్కన పెట్టి ఆ చిత్రం చేయడం జరిగింది.

ఇక తాజాగా వరుణ్ గద్దలకొండ గణేష్ చిత్రం చేయడం ఆయన అభిరుచికి నిదర్శనం. హీరో ఇమేజ్ ఉన్న ఎవరైనా నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోరు, కానీ వరుణ్ ఆ సాహసం చేసి మిగతా హీరోలకు స్ఫూర్తిగా నిలిచాడు. మెగా హీరోలంటేనే కమర్షియల్ హీరోలు అన్న భావనకు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వరుణ్ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More