కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు – కామెడీ కింగ్ అల్లరి నరేష్ లు హీరోలుగా నటించిన సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’. ఈ సినిమాకి ఓ స్పెషాలిటీ ఉంది. అదేమిటంటే మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత వస్తున్న సినిమా ఇది, అలాగే అల్లరి నరేష్ 13 ఏళ్ళ కెరీర్లో ఇది 50వ సినిమా కావడం. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా ఆడియో గత రాత్రి హైదరబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అప్పుడే ఈ సినిమాలో మోహన్ బాబు కొడుకుగా వరుణ్ సందేశ్ కనిపించనున్నాడని తెలియజేశారు.
అంతే కాకుండా మంచు విష్ణు వరుణ్ సందేశ్ గురించిన ఆసక్తికర విషయాలను తెలియజేసాడు. ‘ఈ సినిమాలో నాన్నగారి కొడుకు పాత్ర కోసం వరుణ్ సందేశ్ ని అప్రోచ్ అయినప్పుడు అతను యుఎస్ లో ఉన్నాడు. కానీ అన్నీ ఆపెసుకొని వెంటనే ఇండియాకి వచ్చి 15 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే తను చేసిన పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని’ విష్ణు తెలిపాడు. వరుణ్ సందేశ్ కి మంచు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వలన ఇలా చేసాడని సమాచారం. మోహన్ బాబు సరసన అలనాటి స్టార్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీన జోడీ కడితే, అల్లరి నరేష్ సరసన పూర్ణ జోడీ కట్టింది. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్.


