వరుణ్ సందేశ్ ఎంగేజ్ మెంట్ ముహూర్తం డీటైల్స్

varun-sandesh
2007 లో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత పలు సినిమాలతో విజయాలను అందుకున్న వరుణ్ సందేశ్ రీసెంట్ టైమ్స్ లో సరైన హిట్ లేక కాస్త స్లో అయ్యాడు. కెరీర్ గురించి పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ లోకి వస్తే, వరుణ్ సందేశ్ త్వరలోనే పెళ్ళికి కూడా సిద్దమవుతున్నాడని ఇదివరకే తెలియజేశాం. అది కూడా తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్నాడు.

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హర్ష వర్ధన్ రాణేకి జోడీగా కనిపించిన వితిక షేరుని వరుణ్ సందేశ్ పెళ్లి చేసుకోనున్నాడు. వరుణ్ సందేశ్ – వితిక షేరు కాంబినేషన్ లో పడ్డానండి ప్రేమలో సినిమా వచ్చింది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ని సెట్ చేసారు. వరుణ్ సందేశ్ – వితిక షేరుల నిశ్చితార్ధ వేడుక డిసెంబర్ 7న జుబ్లీ హిల్స్ క్లబ్ లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ కోసం ఉదయం 8గంటల 32 నిమిషాల సమయాన్ని ఫిక్స్ చేసారు. వీరి ఎంగేజ్ మెంట్ కి సంబందించిన కార్డ్ ని మీకోసం అందిస్తున్నాం..

Exit mobile version