‘నింద’ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయ‌నున్న మైత్రీ మూవీస్

‘నింద’ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయ‌నున్న మైత్రీ మూవీస్

Published on Jun 11, 2024 3:23 PM IST

వ‌రుణ్ సందేశ్ లీడ్ రోల్ లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘నింద‌’. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. య‌దార్థ సంఘ‌ట‌నల‌ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాను రాజేష్ జ‌గ‌న్నాథం డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ ద‌క్కింది.

కాగా, ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయ‌నుంది. ఈ మేరకు వారు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. దీంతో ఈ సినిమాకు మ‌రింత హైప్ రావడం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. మైత్రీ సంస్థ సినిమాను రిలీజ్ చేస్తుందంటే, ఆ సినిమాలో ఖ‌చ్చితంగా కంటెంట్ ఉంటుంద‌ని ప్రేక్షకులు న‌మ్ముతారు.

ఇక ఈ సినిమాలో వ‌రుణ్ సందేశ్ తో పాటు త‌నికెళ్ల భ‌ర‌ణి, సిద్ధార్థ్ గొల్ల‌పూడి తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ర‌మీజ్ న‌వీత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జూన్ 21న ‘నింద’ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు