కష్టపడి పనిచేయడం ఎప్పటికీ ఆపను – వరుణ్ తేజ్

Published on Apr 12, 2022 5:30 pm IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గని. గత శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన గని చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కోసం హీరో వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. తన దేహకృతి ను మార్చుకొని మునుపెన్నడూ లేని విధంగా కష్టపడటం జరిగింది. ఈ చిత్రం రిజల్ట్ పై వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదిక గా ఒక ఎమోషనల్ నోట్ ను షేర్ చేయడం జరిగింది.

ఇన్ని సంవత్సరాలలో మీరు నాపై కురిపించిన ప్రేమ మరియు ఆప్యాయతలకు నేను చాలా నిరాడంబరంగా ఉన్నాను. గని నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు మీ హృదయాన్ని మరియు ఆత్మ ను ఉంచారు. మరియు అందుకు నేను ప్రత్యేకంగా నా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము మీకు మంచి చిత్రాన్ని అందించడానికి నిజమైన అభిరుచితో, కష్టపడి పనిచేశాము. ఏదో ఆలోచనగా మేము అనుకున్నట్లుగా చేయలేదు. నేను ఒక చిత్రానికి పనిచేసిన ప్రతిసారీ, నా లక్ష్యం మిమ్మల్ని అలరించడమే. కొన్నిసార్లు నేను విజయం సాధిస్తాను మరియు కొన్నిసార్లు నేను నేర్చుకుంటాను. కానీ నేను కష్టపడి పనిచేయడం ఎప్పటికీ ఆపను అంటూ చెప్పుకొచ్చారు.

అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :