మరో నెల రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం కానున్న మరో హీరో వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడయిన వరుణ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘ముకుంద’. ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 24న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అలాగే ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా డిసెంబర్ 3న జరగనుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చయ్యడంతో ఈ సినిమా మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడింది.
మరో వైపు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాకి డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. తన పార్ట్ మొత్తానికి డబ్బింగ్ పూర్తి చేసాడు. ఫైనల్ గా ఎక్కడన్నా మార్పులు లేదా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే వాటి వరకూ వరుణ్ తేజ్ మరోసారి డబ్బింగ్ చెబుతాడు. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


