
శ్రీకాంత్త అడ్డాల దర్శకత్వం వహిస్తున్న తన తొలి చిత్రం షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్న వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్ కి హాజరు అయ్యాడు. ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈరోజు ప్రారంభం అయ్యింది. పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ని ఠాగూర్ మధు మరియు నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ లోని ముఖ్య సన్నివేసాలని వరుణ్ తేజ్ పూజ హెడ్గే ల పై కొచ్చిన్ అల్లెప్పి లో చిత్రీకరించారు. ఈ చిత్రం లోని చాలా భాగం కేరళ రాజమండ్రి నాగర్కొయిల్ మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. శ్రీకాంత్ అడ్డాల గతం చిత్రాల లానే ఈ చిత్రం లో కూడ మానవ సంభందాల పై ఆధార పడివుంటుంది.
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వి. మణికందన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.