ఇంట్రెస్టింగ్ గా వరుణ్ తేజ్ “మట్కా” గ్లింప్స్

ఇంట్రెస్టింగ్ గా వరుణ్ తేజ్ “మట్కా” గ్లింప్స్

Published on Jan 19, 2024 12:01 PM IST


మెగా కాంపౌండ్ నుంచి ఉన్న ప్రస్తుతం యంగ్ హీరోస్ లో అయితే మొదటి నుంచి కూడా ఏదొక వైవిధ్యతని కనబరుస్తూ ఫలితం ఎలా ఉన్నా కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేసేది మాత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పాలి. తాను హీరోగా ఒకో ఇంట్రెస్టింగ్ జానర్ ని టచ్ చేస్తూ వెళ్తుండగా తన నుంచి ఇపుడు వస్తున్నా చిత్రాల్లో దర్శకుడు కరుణ కుమార్ తో అనౌన్స్ చేసిన చిత్రం “మట్కా” కూడా ఒకటి.

మరి ఓ గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం వరుణ్ తేజ్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యింది. ఇక ఈ చిత్రం నున్నచీ ఈరోజు తన బర్త్ డే కానుకగా రిలీజ్ గ్లింప్స్ మంచి ఆసక్తిని రేవుతుంది అని చెప్పాలి. మరోసారి వరుణ్ తేజ్ అయితే తనలోని వెర్సటాల్టీ చూపించబోతున్నాడు అనిపిస్తుంది. అలాగే దర్శకుడు కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ విజువల్స్ ని చూపించాడు. అలాగే జివి ప్రకాష్ ఇచ్చిన స్కోర్ మరింత హైలైట్ అని చెప్పవచ్చు. మరి ఈ చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు